సమంత , నాగ చైతన్యలను కలపడానికి పెద్ద ప్లాన్ వేశారే! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
Mon Jun 16, 2025 11:48 Entertainment
నాగ చైతన్య – సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేశావె’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 18న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, సమంత ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కలుస్తారనే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, సమంతలు పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. వీరి విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ‘ఏమాయ చేశావె’ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏమాయ చేశావె’ సినిమా సందర్భంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ చిత్రం ఇద్దరికీ చాలా ప్రత్యేకమైనది కావడంతో రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దాదాపు వీరిద్దరూ కలిసే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా సమంత, చైతన్యలను మళ్లీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Samantha Ruth Prabhu #Naga Chaitanya #Ye Maaya Chesave #Samantha #Naga Chaitanya #reunion #Samantha dating Naga Chaitanya #marriage Shobhita Dhulipala #Raj Nidimoru #Telugu movie #re-release #Samantha Naga Chaitanya movie
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.